వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. పొట్టి ఫార్మాట్లో వరుసగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్.. వైస్ కెప్టెన్సీతోపాటు జట్టులో స్థానాన్ని సైతం కోల్పోయాడు. ఈ అంశంపై తాజాగా గిల్ స్పందించాడు. సెలక్టర్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని తెలిపాడు. అలాగే, టీ20 ప్రపంచకప్లో భారత జట్టు విజయం సాధించాలని ఆకాంక్షించాడు.