AP: విశాఖ పోర్టులో పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ శంకుస్థాపనలు చేశారు. దుర్గరాజపట్నంలో పోర్ట్ కం షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు. అలాగే, విశాఖలో రూ.305 కోట్ల వ్యయంతో షిప్ బిల్డింగ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు.