టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒకరాజు’ జనవరి 14న విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. GSTతో కలిపి టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.