TG: సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. పుష్ప-2 సినిమా సమయంలోనే మహిళ చనిపోతే అనుమతి ఎందుకిచ్చానని బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోల కోసం తన దగ్గరకు రావొద్దని చెప్పానని స్పష్టం చేశారు. ఇప్పుడు పెరిగిన ధరలతో తనకు సంబంధంలేదని తేల్చి చెప్పారు.