NTR: కంచికర్ల మండలం పరిటాలలోని ఆంజనేయస్వామి విగ్రహం ఆధ్యాత్మికతకు, అద్భుత శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తోంది. 135 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ భారీ విగ్రహం ప్రపంచంలోని ఎత్తైన హనుమాన్ విగ్రహాల్లో ఒకటిగా ఖ్యాతి గడించింది. ఒకప్పుడు దేశంలోనే ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రం ప్రస్తుతం ఏపీలో ఎత్తైన విగ్రహంగా 3వ స్థానంలో ఉంది.