KRNL: YCP చీఫ్, మాజీ CM జగన్ తన పాలనలో 3 రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని శనివారం మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు రాజధాని అమరావతికి మద్దతు తెలిపారని, అధికారంలోకి రాగానే వికృత రాక్షస క్రీడకు తెరలేపారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ నదీ గర్భంలో రాజధాని అంటూ అమరావతిని విమర్శిస్తున్నారన్నారు.