JGL: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో 84 రోజులకు గాను 13 హుండీలను కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ రావు పర్యవేక్షణలో శ్రీ లలితా సేవా ట్రస్ట్ వారిచే బుధవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ. 5,793,5866 లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే వచ్చిన వెండి, బంగారంను ఒక బ్యాగ్లో వేసి సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరిచినట్లు వెల్లడించారు.