SKLM: అరసవల్లి రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 8గంటలకు అత్యంత వైభవంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు 46 నిమిషాల పాటు సామూహిక సూర్య నమస్కారాల ప్రదర్శన ఉంటుందని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.