KDP: గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కడపలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. రాజీవ్ మార్క్ సర్కిల్ వద్ద మధ్యాహ్నం 3.30 గంటలకు ర్యాలీ ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్, ఎర్రముక్కపల్లి సర్కిల్, ఐటీఐ బిల్ట్ సర్కిల్, వినాయక నగర్ సర్కిల్, అప్సర హాల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు జరుగుతుందని వివరించారు.