KRNL: నందవరం మం. రాయచోటిలో శ్రీకృష్ణదేవరాయల నాటి చరిత్ర కలిగిన శివాలయం ఉంది. ఈ ఆలయం పురావస్తుశాఖ వారి ఆధీనంలో ఉంది. పలుమార్లు ఈ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు లంకె బిందెల కోసం తవ్వకాలు జరిపి, ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరిపినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామస్థులు, శివభక్తులు రెండేళ్లుగా ఆలయం పరిసరాలను శుభ్రం చేస్తూ కాపాడుకుంటున్నారు.