KMM: సీఎం కప్-2026 క్రీడా పోటీలపై యువతకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 8న జిల్లా కేంద్రంలో ‘టార్చ్ లైట్’ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా శాఖ అధికారి సునీల్ రెడ్డి తెలిపారు. 8వ తేదీ ఉదయం 8 గంటలకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ఈ ర్యాలీ ప్రారంభమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.