ADB: జిల్లాలో అటవీ ప్రాంతాల మీదుగా ప్రతిపాదించిన రహదారి నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులు, పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టరేట్లో సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.