PPM: వీరఘట్ట మండలంలో మీకు నచ్చిన ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. నిన్న వీరఘట్టం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. సచివాలయంలో ప్రతి వీఆర్‌కు ఒక ఛాంబర్ ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ డీటీ కవిత, ఆస్ఐ వీఆర్వోలు ఆయనను సత్కరించారు.