JGL: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే సైకిళ్లు కథలాపూర్ మండలానికి చేరుకున్నాయి. మండలంలోని 10 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు. ఇవాళ నుంచి పంపిణీ కార్యక్రమం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బీజేపీ మండలాధ్యక్షుడు మారుతి తెలిపారు.