SKLM: వజ్రపుకొత్తూరు మండలంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహ బాబ్ అహ్మద్ పోలీసులను ఆదేశించారు. నిన్న రాత్రి వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషను డీఎస్పీ సందర్శించారు. దస్త్రాలు పరిశీలించి, పెండింగ్ కేసుల వివరాలు ఎస్సై నిహార్ అడిగి తెలుసుకున్నారు.