GDWL: మా ఆలయ భూమిని కాపాడే వరకు ప్రాణాలకు తెగించి అయినా పోరాటం చేస్తాం అని నీలహళ్లి గ్రామస్తులు పేర్కొన్నారు. ధరూర్ మండలంలోని నీలహళ్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ దేవస్థానానికి చెందిన 5 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం తహసీల్దార్ బి. నరేందర్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు.