SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం రిటైర్డ్ ప్రధాన అర్చకుడు అప్పాల భీమాశంకర శర్మ (65) అనారోగ్యంతో కన్నుమూశారు. పట్టణంలో అర్చక ప్రముఖులలో ఒకరైన భీమాశంకర శర్మ (భీమన్న) ఆలయ ఇంఛార్జి స్థానాచార్యగా పని చేసి ఆగస్టులో పదవీ విరమణ చేశారు. గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.