HYD: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ ఎమర్జెన్సీ వార్డు ఎదురుగా పడి ఉన్న దాదాపు 60ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వెంటనే డ్యూటీ డాక్టర్తో వైద్య పరీక్షలు చేయించగా అప్పటికే వ్యక్తి మరణించినట్లు దృవీకరించారు. డెడ్ బాడీని గాంధీ మార్చురికి తరలించి భద్రపరచారు.