MLG: హైదరాబాదులో ఇవాళ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను మంత్రి సీతక్క, మేడారం ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులు కుటుంబ సభ్యులతో కలిసి జాతరకు హాజరుకావాలని మంత్రి సీతక్క, ఆలయ అర్చకులు ఆహ్వానం పత్రిక, బెల్లం (బంగారం) ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, అధికారులు తదితరులు ఉన్నారు.