VKB: జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు తమ క్రీడా ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ రమాదేవి వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయ బృందంతో కలిసి ఆమె ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు.