AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను CM చంద్రబాబు కోరారు. ఈ మేరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని వినతి పత్రం అందజేశారు. అటు జీ రామ్ జీ పథకంలో కొన్ని అంశాల నుంచి APకి వెసులుబాటు కల్పించాలని అభ్యర్థించారు. కేంద్రం నుంచి ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని అమిత్ షాను కోరారు.