VKB: చౌడపూర్ మండల కేంద్రంలోని పలు వార్డుల్లో కుక్కల బెడద తీవ్రమైంది. కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి సమయంలో మొరుగుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా ఉన్నవారిపై వెనుక నుంచి దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.