VZM: పొదుపు సంఘాలలోని ప్రతీ సభ్యురాలు పారిశ్రామిక వేత్తగా ఎదగేలా కృషి చేయాలని DRDA వెలుగు APD సావిత్రి ఆకాంక్షించారు. బుధవారం గజపతినగరం మండల సమైక్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చిన్న సంఘాలు, గ్రామ సంఘాలు మండల సమాఖ్యను బలోపేతం చెయ్యాలని పేర్కొన్నారు. క్రమం తప్పని పొదుపులు, తిరిగి చెల్లింపులు జరగాలని సూచించారు.