తిరుమలలో ‘పాత మద్యం సీసాల ఘటన’లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారం బయట నుంచి ఖాళీ సీసాలు తెచ్చి వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు విచారణలో తేలిందని వారు తెలిపారు. నిందితుల నుంచి కారు, ల్యాప్టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.