W.G: రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిన్న భీమవరం క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో, వీఆర్వోలు క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లి నేరుగా పాసుపుస్తకాలు అందజేయాలని, అదే సమయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.