అనకాపల్లి జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఓరుగంటి నాగమణి, ఉపాధ్యక్షురాలిగా పెద్దాడ అర్జునమ్మ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాలను జిల్లా పార్టీ అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గురువారం అనకాపల్లిలో అందజేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.