VZM: వేపాడ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఇవాళ అర్హులైన రైతులకు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు స్దానిక MRO రాములమ్మ గురువారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన రీ సర్వేలో అర్హత పొందిన రైతులకు ఈ పుస్తకాలు అందజేస్తామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.