VSP: జిల్లా ఇంఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి గురువారం విశాఖ రానున్నారు. ఈరోజు రాత్రి జిల్లాకు చేరుకొని, రేపు ఉదయం 8.30 గంటలకు ఎంపీ శ్రీభరత్ నివాసానికి వెళ్తారు. అక్కడ నుంచి బయలుదేరి 9.50 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని, జిల్లా సమీక్ష మండలి సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 11.10 గంటల రైలులో తిరుగుపయనమవుతారు.