AP: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ఎథిక్స్ కమిటీ సిద్ధమవుతోంది. కొందరు సభకు రాకుండానే వచ్చినట్లుగా రిజిస్టర్లో సంతకాలు చేశారని, పలువురు జీతాలు క్లెయిమ్ చేసుకున్నారని కమిటీ గుర్తించింది. దీంతో ముందుగా వారి నుంచి వివరణ కోరాలని బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు వారికి త్వరలోనే నోటీసులు పంపనున్నట్లు సమాచారం.