TG: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఇవాళ రాష్ట్ర ఎన్నికల అధికారి రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈనెల 20 లోగా 117 మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.