KRNL: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదాని సోదరుడు రాజేశ్ అదానీ నేడు మంత్రాలయానికి వస్తున్నట్లు మంత్రాలయం ఎస్సై మల్లికార్జున తెలిపారు. ఆయన ఓర్వకల్లు విమానాశ్రయంలో దిగి ప్రత్యేక హెలికాఫ్టర్లో మంత్రాలయం హెలిప్యాడ్ మైదానంలో దిగుతారని చెప్పారు. అక్కడి నుంచి మాధవరం, మాలపల్లి మీదుగా ఆదోని మండలంలోని పెద్దతుంబళంలో వెలసిన జైన్ దేవాలయాన్ని దర్శించుకుంటారన్నారు.