ప్రకాశం: వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. సీబీఐ, ఈడీ కోర్టు అధికారులమని చెప్పి మీ పిల్లలపై కేసు ఉందని, ఇప్పుడే అరెస్టు చేస్తామని భయపెట్టి డబ్బులు దోచుకోవడమే డిజిటల్ అరెస్ట్ అన్నారు. సైబర్ క్రైమ్ బాధితులైతే 1930కి కాల్ చేయండని సూచించారు.