E.G: నిడదవోలు మండలం తాడిమళ్ల 11కేవీ వ్యవసాయ ఫీడర్ నూతన విద్యుత్తు లైన్ ఏర్పా టులో భాగంగా ఈ నెల 9, 10వ తేదీల్లో తాడిమళ్ల గ్రామంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని డివిజన్ ఈఈ ఎన్. నారాయణ అప్పారావు గురువారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.