బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అవి రక్తంలోని చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తాయి. అలాగే, శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, శరీరంలోని వాపు లక్షణాలు కూడా తగ్గుతాయి.