ఏలూరు టూటౌన్ పరిధిలో ఓ మహిళ తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా బంగారు ఆభరణాలను పోగొట్టుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో డీఎస్పీ శ్రావణ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తక్షణమే స్పందించారు. ఆమె ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి, గంటల వ్యవధిలోనే నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఆ బంగారాన్ని బాధితురాలికి అందజేశారు.