PLD: నరసరావుపేటలో ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతారావు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో రేషన్ షాపులు, మున్సిపల్ హై స్కూల్, పెద్ద చెరువు వద్ద అంగన్వాడీ కేంద్రాలు, కేజీబీవీ వసతి గృహాలు, NJPWR స్కూల్లను పరిశీలించారు. అంగన్వాడీల్లో కోడిగుడ్లు, చికెన్ తక్కువగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.