MBNR: అర్హత కలిగిన ప్రతి ఓటర్ పేరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. గురువారం జడ్చర్ల పట్టణంలోని బీ.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో బిఎల్ఓలతో సమావేశం నిర్వహించారు. బిఎల్ఓలు ఎన్నికల నియమ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారిగా పక్కాగా మ్యాపింగ్ జరిపించాలన్నారు.