TG: అవయవదాన మహాయజ్ఞంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలిచింది. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన దేశంలోనే అత్యధికంగా అవయ మార్పిడిలు రాష్ట్రంలో జరిగినట్లు నోడల్ అధికారి భూషణ్ రాజు తెలిపారు. 2025లో రాష్ట్రంలో 205 మంది జీవన్మృతుల అవయవాలను దానం చేశారు. ప్రతి మిలియన్ జనాభాకు అయిదుకు పైగా వ్యక్తుల అవయవ దానాలు జరిగాయన్నారు.