AKP: సబ్బవరం మండలం సీహెచ్ అగ్రహారం, ఇరువాడ, మొగలిపురం గ్రామాల్లో రైతులకు గ్రామ సర్పంచ్ గండి అరుణ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రాజముద్రలతో పాస్ పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడంతో సంబంధిత భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు ఉంటాయన్నారు.