PDPL: యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని, సింగరేణి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ డైరెక్టర్ తిరుమల రావు సూచించారు. శుక్రవారం రామగుండం-3 ఏరియాలో ఆయన పర్యటించారు. జీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. యంత్రాల పనితీరును పరిశీలించారు. ఓసీ-1 డంపుపై ఏర్పాటు చేస్తున్న 37 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పనులను వేగవంతం చేసి త్వరగా ఉత్పత్తిలోకి తేవాలని సూచించారు.