పెట్టుబడులు పెట్టడం ఎంత ముఖ్యమో, వైవిధ్యమైన మదుపు మార్గాలను ఎంచుకోవడమూ అంతే ముఖ్యం. మీ సంపాదన మొత్తాన్ని ఒకే చోట పెట్టుబడి పెట్టడం వల్ల మీరు నష్టపోయే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా స్టాక్ మార్కెట్, బాండ్లు, రియల్ ఎస్టేట్, బంగారం తదితర రూపాల్లో పెట్టుబడులు పెడితే నష్టభయం తక్కువగా ఉంటుంది.