AP: నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఇది క్రమంగా పశ్చిమ-వాయవ్య దిశగా శ్రీలంక వైపుగా కదలనుంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు TN, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా. దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.