ప్రకాశం: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి ఇరువురు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట వెంట జిల్లా టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.