KNR: కరీంనగర్‌తో పాటు శివారు గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కలిసి ఆరేపల్లి, కోతిరాంపూర్‌లలో రూ.40 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని ఆయన తెలిపారు.