HYD: బంజారాహిల్స్ రోడ్ నం.12లోని శ్రీరామ నగర్ బస్తీలో సీసీ రోడ్డు దెబ్బతినడంతో కొత్త రోడ్డు వేస్తున్నారు. ఈ క్రమంలో పాత రోడ్డును పూర్తిగా తొలగించారు. ఇదే అదునుగా భావించిన స్థానికంగా ఉన్న బస్తీ వాసులు అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న జలమండలి మేనేజర్ 19 మందిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కేసు నమోదు చేయించారు.