TG: హిల్ట్ పాలసీకి ప్రతిపక్షాలు మద్దతు తెలపాలని Dy. CM భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి లేఖ రాస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. 2014 నుంచి, ఇటీవల తమ ప్రభుత్వం తెచ్చిన హిల్ట్పీతో పాటు ఇప్పటివరకు జరిగిన పారిశ్రామికవాడల్లోని భూముల వినియోగ మార్పిడిపై ఏ విచారణను ఆదేశించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమలను ORR బయటకు పంపిస్తామన్నారు.