TPT: మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోఖూల్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం నైవేద్యం సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయన వరాహ స్వామి వారిని దర్శించి, అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ రంగనాయక మండపంలో దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి, ఛైర్మన్, అదనపు ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు.