»Tamil Nadu Kallakurichi Consuming Illicit Arrack 34 People Die Chief Minister M K Stalin One Man Commission Enquiry
Tamilnadu : తమిళనాడులో కల్తీ మద్యం తాగి 34 మంది మృతి.. విచారణకు ఆదేశించిన సీఎం స్టాలిన్
తమిళనాడులోని కళ్లకురిచ్చి కరుణాపురం ప్రాంతంలో గురువారం అక్రమ మద్యం సేవించి 34 మంది మరణించారు. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన తర్వాత మరో 100 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
Tamilnadu : తమిళనాడులోని కళ్లకురిచ్చి కరుణాపురం ప్రాంతంలో గురువారం అక్రమ మద్యం సేవించి 34 మంది మరణించారు. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన తర్వాత మరో 100 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి గోకుల్దాస్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో పాటు కల్తీ మద్యం విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. కల్తీ మద్యం తాగి చనిపోయిన 34 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల సాయం అందజేస్తామని సీఎం ప్రకటించారు.
హూచ్ దుర్ఘటనపై రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు పరిశీలన అనంతరం నివేదిక అందజేస్తామన్నారు. కల్తీ మద్యం తయారు చేసేందుకు మిథనాల్‌ను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం గంటల తరబడి పోలీసులతో సహా జిల్లా అధికారులు విచారణ జరిపారు. చాలా మంది కల్తీ మద్యాన్ని సేవించారు. కొందరు తమ ఇళ్లలో నిల్వ చేసుకున్నారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై జూన్ 22 న డిఎంకె ప్రభుత్వం కల్తీ మద్యం ఉత్పత్తి, విక్రయాలను అరికట్టడంలో విఫలమైందని ఆరోపించారు. దీంతో రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చారు. అయితే సిబిసిఐడి అధికారులు కళ్లకురిచిలో తమ దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా మిథనాల్ కారణంగానే మరణాలు జరిగాయని.. దానిపై విచారణ జరపాలని ఆదేశించినట్లు స్టాలిన్ తెలిపారు. అధికారులు ఇప్పటికే దాదాపు 200 లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టెస్టుల్లో మిథనాల్ పెద్ద మొత్తంలో ఉన్నట్లు తేలింది. బాధితులను ఆదుకునేందుకు ఆరోగ్య శాఖ మంత్రి ఎంఏ సుబ్రమణ్యం, పీడబ్ల్యూడీ మంత్రి ఈవీ వేలు కళ్లకురిచిలో ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ మాట్లాడుతూ 116 మంది వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో చేరగా వారిలో 34 మంది మరణించారని తెలిపారు.