»The Death Toll In The Kalti Sara Incident Has Reached 58 And Some Others Are Serious
Kallakurichi: కల్తీసారా ఘటనలో 58కి చేరిన మృతులు.. మరికొంత మంది సీరియస్
దేశాన్ని కుదిపేసిన కల్తీ సారా కేసులో మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికి 58 మంది ఈ కల్తీ సారాకు బలయ్యారు. ఇంకా కొంత మంది వెంటిలేటర్స్‌పై చికిత్స తీసుకుంటున్నారు.
The death toll in the Kalti Sara incident has reached 58.. and some others are serious
Kallakurichi: కల్తీ సారా తాగి మృత్యువాత పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుండడం అందరిలో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే 58 మంది మరణించారు. ఇంకా చాలా మంది సీరియస్‌గా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి (Kallakurichi) జిల్లా కరుణాపురంలో ఈ దారుణం జరిగిన విషయం తెలిసిందే. పోలీసు నిర్లక్ష్యం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే కల్తీసారా (Toxic Alcohol) తాగి ఆసుపత్రిలో చేరిన వారిలో చాలా వరకు ప్రాణాపాయ స్థితిలో ఉండడం అందరిలో కలవరాన్ని సృష్టిస్తుంది. జిల్లా కలెక్టర్ కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎమ్ఎస్ ప్రశాంత్ (Collector MS Prashanth) తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం వరకు మొత్తం 58 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.
కల్తీ సారా వలన కొంత మంది బాధితుల్లో కిడ్నీలు, ఇతర అవయవాలు ఫెయిల్ అవుతున్నట్లు వైద్యులు వెల్లడించారని కలెక్టర్ చెప్పారు.
విళుపురం, కళ్లకురిచి, సేలం, పుదుచ్చేరి ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 200 మందికిపైగా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. అందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొంత మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో కారకులైన మొత్తం 11 మందిని సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.