»Tv Video Journalist Trampled To Death While Shooting Wild Elephants In Kerala
Journalist died : వీడియో తీయబోయి ఏనుగు దాడిలో మరణించిన జర్నలిస్ట్
అడవి ఏనుగుల గుంపును వీడియో తీసేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుపై ఓ ఏనుగు దాడి చేసింది. దీంతో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Journalist died : నదిని దాటుతున్న ఏనుగుల గుంపును వీడియో తీయడానికి ఓ జర్నలిస్ట్ చేసిన ప్రయత్నం చివరికి అతడిని మృత్యు ఒడికి చేర్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడి కొట్టెక్కాడ్ అటవీ ప్రాంతంలో ఏనుగులు తిరుగాడుతూ ఉంటాయి. దీంతో అవి నదిని దాటేప్పుడు వీడియో తీసేందుకు ముకేష్(34) అనే జర్నలిస్టు(JOURNALIST) ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
అక్కడ వెళుతున్న ఏనుగుల గుంపును వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. కెమేరాను సెట్ చేసుకుంటున్న సమయంలో ఓ ఏనుగు వేగంగా అతడి వైపు వచ్చింది. అతడిపై దాడి చేసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాసేపటి తర్వాత అతడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. అయినా సరే అతడి ప్రాణం నిలవలేదు. చివరికి కొన ఊపిరి వదిలాడు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ ఆవేదన వ్యక్తం చేశారు. యుక్త వయసులో ఉన్న వీడియో జర్నలిస్ట్(VIDEO JOURNALIST) ఇలా చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అతడిపై దాడి జరిగిన విషయం తెలుసుకుని ఫారస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని హుటా హుటిన ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అయినా ఇలా జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు.